Mane Praveen

Apr 25 2024, 21:26

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులు ఇవ్వాలని వినతి పత్రం

నల్లగొండ: తెలంగాణ గవర్నమెంట్ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం సూచన మేరకు ఈరోజు టీజి సిజిటిఏ నల్లగొండ జిల్లా యూనిట్ బాధ్యులు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ రిజిస్టార్ అల్వాల రవి ని కలిసి, యూజీసీ నిబంధనల ప్రకారం వేసవి సెలవులు ఆరు వారాలకు తగ్గకుండా ఇవ్వాలని, విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు మే 10 నుండి జూన్ 23 వరకు వేసవి సెలవులను ప్రకటించాలని వినతి పత్రం ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో టి జి సి జి టి ఏ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ మునీర్, ఉపాధ్యక్షులు టి. భాస్కర్ రెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఈ. యాదగిరి రెడ్డి, సుదర్శన్ రెడ్డి,. తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 25 2024, 21:25

నాగార్జునసాగర్ జలాశయంలో తగ్గుతున్న నీటి నిల్వలు

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుతున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 505. 70 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 124.48 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

అవుట్ ఫ్లో 6, 841 క్యూసెక్కులు నమోదు కాగా, ఇన్ ఫ్లో లేదు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 25 2024, 12:32

పేద ప్రజల పక్షాన పోరాడే జాహంగీర్ నే గెలిపించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: కమ్యూనిస్టుల పోరాట ఫలితమే ఉపాధి హామీ చట్టం వచ్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మర్రిగూడెం మండలం నిమ్మలగుట్ట దగ్గర ఉపాధి హామీ కూలీలను కలిసి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓట్లను అడగడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 35 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించిన జాంగిర్ను గెలిపించండి అని ఆయన కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టలు కొడుతూ నిధులకు కోత పెట్టిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసేయాలని ఆలోచన వెనక్కి తీసుకొని పని దినాలు కూడా 200 రోజులు పెంచి, గిట్టుబాటు కూలిరేట్లను కట్టించి ఎండ తీవ్రతలకు తట్టుకునే టెంట్లను, మంచినీళ్లు తదితర మౌలిక వసతులు కల్పించి ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలన్నారు. మీ అమూల్యమైన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి కమ్యూనిస్టులను చట్ట సభలకు పంపిస్తే ఇలాంటి అనేక చట్టాలను తీసుకురావడానికి దోహదపడుతూ, పేద ప్రజల పక్షాన నిలబడే జాంగిర్ను గెలిపించాలన్నారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి, మర్రిగూడెం మండలాల కార్యదర్శి లు నాంపల్లి చంద్రమౌళి, ఏర్పుల యాదయ్య, నల్గొండ పార్లమెంట్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటీ శంకర్, రాములు, యాదమ్మ, మారమ్మ, ప్రమీల, సుధాకర్, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 25 2024, 11:58

NLG: జిల్లా బిజెపి కార్యాలయంలో ఓబీసీ మోర్చ జిల్లా కార్యవర్గ సమావేశం

నల్లగొండ: బిజెపి జిల్లా ప్రధాన కార్యాలయంలో OBC మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఓ బి సి మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం బుధవారం నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటుకు సంబంధించిన నాలుగు అసెంబ్లీ లు (మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, మరియు నల్లగొండ,) ల ఓబీసీ మోర్చా మండల కార్యవర్గాలతో బీసీ సమ్మేళనం నిర్వహించడం జరిగినది. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా OBC మోర్చ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. దేశానికి భారత ప్రధాని చేస్తున్నటువంటి నిరంతర కృషిని కొనియాడారు. ముఖ్యంగా బీసీ బిడ్డయినా ప్రధాని మోదీ సామాజిక న్యాయం కోసం అతని మంత్రివర్గంలో అత్యధికంగా 27 మందికి స్థానం కల్పించి, తన సామాజిక న్యాయం చాటారు మరియు బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పరచటానికి ప్రధాని మోదీ విశ్వకర్మ యోజన క్రింద 18 రకాల చేతి వృత్తిదారులకు ఎలాంటి పూచీకత్తు లేని రుణ సదుపాయాలను కల్పిస్తూ, తను బీసీల పట్ల గల ప్రత్యేక శ్రద్ధ చూపించారు.

ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం.. తెలంగాణకు బీసీ వ్యక్తిని సీఎం గా ప్రకటించి బీసీల ప్రక్షాళన కోసం చూపిన ఆదరణ నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. మరొకసారి మోదీ ప్రధాని కావడం వందకు రెండు వందల శాతం రుజువు అయిందని బిజెపికి వచ్చే 400 + లో నల్లగొండ పార్లమెంటు ఉంటే మన నల్లగొండ అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఐకమత్యంగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో గంధ మల్ల ఆనంద్ గౌడ్ ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు,

నాగం వర్షిత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు, 

చాడ శ్రీనివాస్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ ప్రబారి,

అన్నం ఈశ్వరప్ప ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

జక్కలి రాజు యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి,

మదన్ మోహన్ OBC మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యాదగిరి చారి ఓబీసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నేతల వెంకటేష్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భవాని ప్రసాద్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏరుకొండ హరి నల్లగొండ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి,

తిరందాస్ కనకయ్య ఓబిసి మోర్చా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఓబీసీ మోర్ఛ జిల్లా అధికార ప్రతినిది, సామగాని దినేష్ గౌడ్, మరియు మహేష్, నరేందర్ గౌడ్, కోటేష్, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Apr 24 2024, 09:48

NLG: పేదింటి బిడ్డ పెళ్లికి సాయం అందించిన ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం, మాల్ పట్టణంలోని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు సేవలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, నల్లవెల్లి గ్రామానికి చెందిన జోగు చంద్రయ్య అంధుడు మరియు పేదరికంలో ఉన్నాడు. ఆయన చిన్న కూతురు వివాహానికి ఫౌండేషన్ చైర్మన్ ముత్తు రూ.10,000 ఆర్థిక సహాయంగా అందించారు.

ఈ సందర్బంగా ముత్తు మాట్లాడుతూ.. తన తండ్రి పేరున ఉన్న ఈ ఫౌండేషన్ పేదలకు సహాయాన్ని అందిస్తుందని, ఆకలితో ఉన్న వారికి అండగా ఉంటుందని, ఎవరికి సహాయం కావాలన్నా తమ ఫౌండేషన్ ను సంప్రదించాలని అన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 23 2024, 22:32

NLG: లెంకలపల్లి లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

నల్లగొండ జిల్లా: మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం హనుమాన్ దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు.

అనంతరం సాయంత్రం హనుమాన్ శోభాయాత్ర ను దేవాలయం నుండి ప్రారంభించి గ్రామంలో ఊరేగింపు గా బయలుదేరి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 23 2024, 18:24

13-14 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ:13,14 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడుతూ.. రేపు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

కెసిఆర్ నల్లగొండ జిల్లాను నాశనం చేశారని,కేసీఆర్ వల్లనే జిల్లాకి కరువు వచ్చిందని,నీటి జలాలు పంపకంలో జగన్,కేసీఆర్ లాలూచీ పడ్డారని మండి పడ్డారు.భారాస ఒక్క సీట్ కూడా గెలవదని జోష్యం చెప్పారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 23 2024, 17:01

NLG: ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ ఏర్పాటు చేస్తాం: కేంద్ర మంత్రి

బిజెపి నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.

నల్లగొండలో ఏర్పాటుచేసిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బిజెపి గెలిస్తే నల్లగొండలో ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని, తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 23 2024, 15:47

TG: నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: CS శాంతి కుమారి

HYD: వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిషితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కోరారు.

సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మున్సిపల్, నీటిపారుదల, పంచాయితీ రాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు.

సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

నగరంలో నీటి పరిస్థితిని ప్రస్తావిస్తూ సంబంధిత సిజిఎం ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహణ పనులు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. CGMలు ప్రతిరోజూ తమ పరిధిలోని మేనేజర్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు.

అదే విధంగా మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. నాగార్జునసాగర్ నుంచి నీటి పంపింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి లోటు ఉండదని అధికారులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు.

సీడీఎంఏ దివ్య మాట్లాడుతూ.. మంచినీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని, లీకేజీలు ఏవైనా ఉంటే వెంటనే సరిచేస్తున్నామని, ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్‌ లైన్‌ ను ఏర్పాటు చేశామని, నీటి సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

SB NEWS TELANGANA

Mane Praveen

Apr 23 2024, 15:21

NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించిన సిపిఎం మండల కార్యదర్శి

మర్రిగూడ మండల కేంద్రంలో, సిపిఎం అభ్యర్థి ఎం.డి జహంగీర్ గెలిపించి పార్లమెంటుకు పంపించాలని, మంగళవారం సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రచారం నిర్వహించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశవాద రాజకీయ నాయకులను, దేశ విచ్ఛిన్నకర శక్తులను, రాజకీయ వ్యాపారస్తులను ఓడించాలని, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే సిపిఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని యాదయ్య కోరారు. నక్క సిరియాల, పల్లెటి లోకేష్, దుబ్బ ఎల్లెష్ తదితరులు ఉన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG